![]() |
![]() |
.webp)
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో దర్శన్ అనే కంటెస్టెంట్ స్పెషల్ గా తన టాలెంట్ ఆఫ్ సింగింగ్ తో అలాగే చక్కగా తెలుగు నేర్చుకుని జడ్జెస్ ని ఇంప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో దర్శన్ ఒక అద్భుతమైన సాంగ్ పాడి జడ్జెస్ అందరినీ మెప్పించాడు. "నేను నా నెక్స్ట్ ఫిలింని సుదీప్ తో అలాగే సంతోష్ ఆనంద్ రామ్ తో కలిసి పని చేస్తున్నాను. ఆ మూవీలో నువ్వు ఒక సాంగ్ పాడాలి. అలాగే నువ్వు పాడే పాత రికార్డింగ్ సెషన్ కి విజయ్ ప్రకాష్ ని కూడా పిలుస్తాను" అంటూ థమన్ ఒక బిగ్ ఆఫర్ ని దర్శన్ కి ఇచ్చేసరికి అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇక లాస్ట్ వీక్ ఐతే సహస్ర అనే కంటెస్టెంట్ "జరగండి జరగండి" అనే సాంగ్ ని హైపిచ్ లో జడ్జెస్ ని మెప్పిస్తూ అద్భుతంగా పాడింది. దాంతో థమన్ ఫిదా ఐపోయాడు. "నువ్వు పాడిన ఈ పాటతో నేను సునిధి చౌహన్ ని, దలేర్ మెహందీ అందరినీ మర్చిపోయాను. నీ వాయిస్ మాత్రమే మోతమోగుతోంది. సో నా స్టూడియోకి వచ్చేయి. ఈ సాంగ్ మీద ఒక కవర్ సాంగ్ చేద్దాం" అంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చారు థమన్. ఇలా ప్రతీ సీజన్ లో జడ్జెస్ వాళ్ళు చేసే మూవీస్ లో కానీ అలాగే స్టేజి షోస్ లోకి ఇలాంటి కంటెస్టెంట్స్ కి అవకాశం కల్పిస్తూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునేలా సపోర్ట్ చేస్తున్నారు.
![]() |
![]() |